బాఫ్టా అంబాసిడర్ గా ఏ ఆర్ రెహమాన్…!?

November 30, 2020 at 2:20 pm

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన పురస్కారం దక్కింది. ఆయన్ని అస్కార్‌ అవార్డుతో సరిసమామైన అవార్డులను ప్రదానం చేసే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌‌ట్స బాఫ్టా సంస్థ ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా రెహమాన్ ని నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది బాఫ్టా. నెట్‌ఫ్లిక్స్‌ తో కలిసి భారత్‌లో ఉన్న గొప్ప కాళాకారులను ఎంపిక చెయ్యడానికి ఏర్‌ఆర్‌ రెహమాన్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసారు.

ఐదు రంగాల్లో తమ ప్రతిభ కనబరిచిన వారిని బాఫ్టా గుర్తించనుంది. తన ఎంపికపై ఏఆర్‌ రెహమాన్‌ స్పందించి, నాకు చాలా ఆనందంగా ఉంది. బాఫ్టాతో పని చేస్తూ సినిమాలు, ఆటలు, టీవీ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ చూపేవారిని గుర్తించడం కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అంటూ రెహమాన్ తెలిపారు. ఏఆర్‌ రెహమాన్‌ బాఫ్టా అంబాసిడర్‌గా తమకు మద్దతుగా నిలిచినందుకు ఆనందంగా ఉందని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా బెర్రీ అన్నారు.

బాఫ్టా అంబాసిడర్ గా ఏ ఆర్ రెహమాన్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts