టీవీ నటుడు అషీష్ రాయ్ మృతి..!

November 24, 2020 at 2:47 pm

ఈ ఏడాది అసలు ఎవ్వరికి పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. ఇటు కరోనా వైరస్ కారణంగా కొందరు సినీ నటీనటులు, మూవీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల మరణిస్తే, మరికొంత మంది ఆత్మహత్య చేసుకుని అభిమానుల్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసారు. ఇప్పుడు తాజాగా టీవీ న‌టుడు అషీష్ రాయ్ కిడ్నీ వ్యాధితో గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చివరికి మృతి చెందారు. ఆయ‌న ఇప్పటికే రెండు సార్లు డ‌యాల‌సిస్ చేయించుకున్నాడు. చివరికి తన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించి చనిపోయారు.

మేలో వైద్యం కోసం ఆసుప‌త్రిలో చేరిన అషీష్‌కు వైద్యం చేయించుకునేకూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచి ఆఫ‌ర్స్ రాక, అటు లాక్‌డౌన్ పరిస్థితుల ప్ర‌భావం చేత ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. అషీష్ త‌న ఇంటి వ‌ద్దేనే ఈ రోజు కన్నుమూసారు. అషీష్ రాయ్ కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ, బనేగి అప్ని బాత్, రీమిక్స్, సాసురల్ సిమార్ కా, వంటి టెలివిజన్ షోలో న‌టించి మంచి పేరు సంపాదించారు.

టీవీ నటుడు అషీష్ రాయ్ మృతి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts