ఆయనను పాత బస్తి లోకి రప్పిస్తారా : ఒవైసీ

November 26, 2020 at 5:03 pm

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా మారిపోయాయి.. ఈ క్రమంలోనే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఎంఐఎం పార్టీకి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది తాజాగా బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఉద్దేశిస్తూ స్పందించిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ… బిజెపి కి సవాల్ విసిరారు ప్రధాని నరేంద్ర మోడీ ని తీసుకొచ్చి పాతబస్తీలో ప్రచారం చేయించాలని సభ కూడా నిర్వహించాలని ఎన్ని సీట్లు గెలుస్తుందో మేము కూడా చూస్తాం అంటూ సవాల్ విసిరారు.

అంతేకాకుండా పాతబస్తీలో రోహింగ్యాలను పాకిస్థానీలు ఉన్నారు అంటూ బిజెపి బండి సంజయ్ ఆరోపిస్తున్నారని… పాకిస్థానీయులు భారత్ లోకి చొరబడి తే అప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పూర్తి బాధ్యులు బీజేపీ అమిత్ షా నరేంద్ర మోడీ లు అంటూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు..

ఆయనను పాత బస్తి లోకి రప్పిస్తారా : ఒవైసీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts