బాబోయ్ ఇన్ని పెళ్లి కానుకలా.. అల్లుడు అదృష్టవంతుడంతే..?

November 7, 2020 at 5:48 pm

సాధారణంగా పెళ్లిళ్లు జరిగాయి అంటే… వధువు తరపు కుటుంబీకులు వరుడికి తమకు ఉన్నంతలో కానుకలు సమర్పించుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగినప్పుడు ఎంతో విలువైన కానుకలు ఇస్తుంటారు. పైన కి వారు ఇచ్చే కానుకలు కనిపించక పోయినప్పటికీ లోలోపల మాత్రం భారీగానే కానుకలు ఇస్తుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ తన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాడు తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు.

తరతరాలు గుర్తుండి పోయేలా తన కూతురు వివాహం చేయాలనుకుని ఏకంగా భారీగా కానుకలను తన అల్లుడికి ఇచ్చాడు తమిళనాడుకి చెందిన రాజకీయ నాయకుడు. ఇక వ్యక్తి ఇచ్చిన కానుకలకు అందరూ ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు కిలోల బంగారు నగలు, రెండు బైక్స్, ఒక కారు, ఒక ట్రాక్టర్, బియ్యం బస్తాలు, పశువులు, మేకలు సహా ఇంకా ఎన్నో కానుకలు ఏకంగా అల్లుడికి సమర్పించుకున్నాడు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు.

బాబోయ్ ఇన్ని పెళ్లి కానుకలా.. అల్లుడు అదృష్టవంతుడంతే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts