వాట్సప్ ఓటీపీతో జాగ్రత్త సుమా..!

November 24, 2020 at 2:29 pm

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అందరు వాట్సాప్ యాప్ యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ కి ఎక్కువ మంది వినియోగదారులు కూడా ఉన్నారు. అందుకే ప్రస్తుతం హ్యాకర్లు కాని వాట్సాప్ పై పడింది. వాట్సాప్ నియోగదారులను కొత్త పద్దతిలో మోసం చెయ్యటానికి ప్లాన్ చేసారు హ్యాకర్లు. వినియోగదారుల వాట్సాప్‌లోని ముఖ్యమైన డేటాను పొందడానికి హ్యాకర్లు వాట్సాప్ ‌కు వచ్చే ఓటీపీని మార్గంగా ఎంచుకున్నారు. ఓటీపీ ద్వారా వాట్సాప్ అకౌంట్ లోకి ప్రవేశించి, కీలక సమాచారాన్ని దొంగతనం చేస్తున్నారు హ్యాకర్లు .

ఈ వాట్సాప్ ఓటీపీ స్కాంలో భాగంగా, మీ ఫ్రెండ్ పేరుతో తెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ వస్తుంది. తన ఫోన్‌‌ నెంబర్ పనిచేయడం లేదని, వాట్సాప్‌ అకౌంట్ వేరే ఫోన్‌లో యూజ్ఓ చేసేందుకు ఓటీపీ కోసం మీ నంబర్‌ ఇచ్చానంటూ మీకు వచ్చిన ఓటీపీని వెంటనే తనకు పంపించమంటూ మెసేజ్‌ వస్తుంది. వెంటనే మీరు ఓటీపీని పంపించడం కోసం మీ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే తన ఫోన్ బాగానే వర్క్ చేస్తుందని, తాను ఎవరికీ మీ నెంబర్ ఇవ్వలేదంటూ చెప్పడంతో మీరు ఆశ్చర్యపోయి షాక్ అవుతారు. వెంటనే కాల్ సెంటర్ కి ఫోన్ చేసి కనుకుంటే, అది స్కాం అని తెలుస్తుంది. కాబ్బటి మీకు వేరే నెంబర్ నుండి ఓటీపీ వస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి స్కాం జరగకుండా ఉండాలంటే, మీ వాట్సాప్‌ అకౌంట్టూ కు టూ స్టెప్ ‌ వెరిఫేకేషన్‌ను ఎనేబుల్ చేసుకోవడం ఉత్తమం.దీని వల్ల పొరపాటున మీరు ఓటీపీ పంపినా మీ అకౌంట్ ను హ్యాక్‌ చేయలేరు. పొరపాటున ఎప్పుడైనా మీ అకౌంట్ హ్యాక్ అయిన పక్షంలో వెంటనే మీ వాట్సాప్‌ని రీసెట్ చేసి తిరిగి లాగిన్ అయితే చాలు.

వాట్సప్ ఓటీపీతో జాగ్రత్త సుమా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts