భారీ తారాగణం మొదలు కానుంది..!!

November 23, 2020 at 5:24 pm

టాలీవుడ్లో భారీ తారాగణం అన్న వెంటనే ప్రముఖ స్టార్ హీరోలు, హీరోయిన్లతో ఇంకా పెద్ద పేరున్న నటీనటులు నటిస్తారు అని అంచనా వెయ్యటం సహజం. కానీ తాజాగా మొదలయిన భారీ తారాగణం చిత్రం ద్వారా ప్రముఖ హాస్యనటుడు అలీ భార్య జుబేదా బేగం సోదరి తనయుడు సదన్‌ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. బీవీఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై శేఖర్‌ ముత్యాల దర్శకత్వంలో, బీవీ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా రెడ్డి, రేఖా నిరోష హీరోయిన్ల గా నటిస్తున్నారు.

మొదటి సన్నివేశానికి దర్శకుడు ఎస్వీ కష్ణారెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేసారు.నిర్మాత అచ్చిరెడ్డి చిత్రానికి క్లాప్‌ ఇచ్చారు. మూవీ మొదటి షాట్‌కి అలీ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకురాలు ఎమ్‌ఎమ్‌. శ్రీలేఖ జ్యోతి వెలిగించారు. మంచి కథతో భారీ తారాగణం చిత్రం రూపొందుతోంది అంటూ హీరో సదన్ తెలిపాడు‌. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుండి ప్రారంభించి వచ్చే వేసవి కాలంలో సినిమా విడుదల చేస్తాం అంటూ బీవీ రెడ్డి అన్నారు.

భారీ తారాగణం మొదలు కానుంది..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts