
తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ రోజురోజుకు రంజుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 12వ వారం వచ్చే సరికి బిగ్ బాస్ ఇంట్లో హారిక, మోనాల్, అరియానా, అవినాష్, అఖిల్, సొహైల్ మరియు అభిజిత్‌లు మిగిలి ఉన్నారు. టైటిల్ కోసం పోటా పోటీ పడుతున్న వీరిందరూ స్ట్రోంగ్ కంటెస్టెంట్లే. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.
ఈ వారం ఎలిమినేషన్‌కు గానూ అరియానా, మోనాల్, అఖిల్, అవినాష్‌లు నామినేట్ అయ్యారు. అయితే వీరిలో అఖిల్, అవినాష్ ఇద్దరికీ ఫుల్ ఫాలోంగ్ ఉండడంతో.. వీరు ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు. అలాగే మోనాల్ కూడా ఈ వారం సేఫ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, అభిజిత్ కోసం మోనాల్ నామినేట్ కావడంతో.. ఈసారి అభి, హారిక ఓట్లు అన్నీ కూడా మోనాల్‌కు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
అలాగే గత మూడు వారాలు కూడా మోనాల్ టాస్కుల్లో పాల్గొంటూ మంచి ఎఫర్ట్ పెడుతోంది. దీంతో ఈ వారం కూడా మోనాల్ సేఫ్ కాబోతున్నట్టు సమాచారం. ఇక మిగిలిన అరియానానే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.