
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ 13వ వారినికి చేరుకున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు రంజుగా సాగుతున్న ఈ షో చివరి దశకు చేరువవుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక 13వ వారం మోనాల్, అఖిల్, అవినాష్ మరియు అరియానాలు నామినేషన్లో ఉండగా.. అవినాష్ ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించారు.
అయితే ఎవిక్షన్ పాస్ ద్వారా అవినాష్ తనని తాను సేవ్ చేసుకున్నాడు. దీంతో 13వ వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం.. ఈ వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారని లీకుల వీరుల ద్వారా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం అఖిల్, సొహైల్, మోనాల్, అభిజిత్, అవినాష్, అరియానా మరియు హారికలు బిగ్ బాస్ ఇంట్లో కొనసాగుతున్నారు. మరి వీరిలో ఫైనల్స్ చేరిది ఎవరో.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కు గురయ్యే ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.