
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. నేటి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. మహా ఘటబంధన్, ఎన్డీయే మధ్య పోటీ హోరాహోరీగా ఉండడంతో గెలుపెవరిదో అన్న టెన్షన్ అందరిలోనూ మొదలైంది.. తాజా సమాచారం మేరకు ఎన్డీయే అభ్యర్థులు 109 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అందులో బీజేపీ 60 చోట్ల, జేడీయూ 42 చోట్ల, ఎన్డీయేలోని ఇతర పార్టీలు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక మహా ఘటబంధన్ అభ్యర్థులు 115 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అందులో ఆర్జేడీ 72 స్థానాల్లో కాంగ్రెస్ 31 స్థానాల్లో, సీపీఐ (ఎంఎల్) 7 చోట్లు, మహా ఘటబంధన్ లోని ఇతర పార్టీలు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఎంఐఎం సైతం ఒక స్థానంలో సత్తా చాటేలా కనిపిస్తోంది. కాగా, బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ఇవాళే ఓట్ల లెక్కింపు పక్రియ జరుగుతోంది. ఇవాళే ఫలితం తేలనుంది. మరోవైపు ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలా ఉన్నాయి. దీంతో పాట్నాలోని మహాఘట్బంధన్ సారథి, లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది.