100కు పైగా స్థానాల్లో ఆర్జేడీ ఆధిక్యం.. తొలి ట్రెండ్స్ ఇవే!

November 10, 2020 at 9:23 am

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉద‌యం 8 గంట‌ల నుంచి ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ), బీజేపీ కలిసి ఓ కూటమిగా, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ – కాంగ్రెస్ మరో కూటమిగా ఏర్ప‌డి పోటీ పడిన సంగతి తెలిసిందే.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆర్జేడీ ఘన విజయం దిశగా సాగుతోందనిపిస్తోంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ లో 185 స్థానాల తొలి దశ కౌంటింగ్ పూర్తి కాగా, ఎన్డీయే 74 స్థానాల్లో, మహా ఘటబంధన్ 109 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. ఎల్జేపీ ఒక్క స్థానంలో, ఇతరులు మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

అయితే మ‌రోవైపు బీహార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా అక్కడ గెలిచేది తామేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాల్సి ఉంటుంది.

100కు పైగా స్థానాల్లో ఆర్జేడీ ఆధిక్యం.. తొలి ట్రెండ్స్ ఇవే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts