బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కరోనాతో మృతి..?

November 7, 2020 at 5:20 pm

మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది అంటూవుంటారు. ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో ఇలాంటిదే జరిగింది. గతంలో జెడియు పార్టీలో ఉండి ఎన్నో కీలక పదవులు చేపట్టిన నీరజ్ అనే వ్యక్తి ఈ సంవత్సరం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముమ్మర ప్రచారం చేపట్టి ఓటర్ మహాశయులకు ఆకట్టుకున్నారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక నేడు బీహార్ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనే కరోనా వైరస్ బారిన పడిన ఇండిపెండెంట్ అభ్యర్థి చివరికి పరిస్థితి విషమించి మృతి చెందారు.

దీంతో అభిమానులందరూ తీవ్రస్థాయిలో విషాదం నెలకొంది. 2012 వరకు జె డియూ పార్టీలో కొనసాగిన నీరజ్ పార్టీలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. నీరజ్ ఆకస్మిక మృతితో అభిమానులందరూ ప్రస్తుతం విషాదంలో మునిగిపోయారు. నీరజ్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల భేరీ శెట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కరోనాతో మృతి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts