బిజెపి గూటికి చేరబోతున్న కత్తి కార్తీక..?

November 21, 2020 at 5:40 pm

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సినీనటి న్యూస్ ప్రెజెంటర్స్ కత్తి కార్తీక ఒక్కసారిగా తెర మీదికి వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడమే కాదు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లో చేరిన కత్తి కార్తీక ఆ పార్టీ తరఫున పోటీ చేసింది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక విజయం సాధించలేకపోయింది.

కాగా దుబ్బాక ఉప ఎన్నికలతో రాజకీయాల వైపు అడుగులు వేసిన కత్తి కార్తీక చూపు ప్రస్తుతం బీజేపీ వైపు పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో మర్యాదపూర్వక సమావేశమయ్యారు కత్తి కార్తీక. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి కిషన్ రెడ్డి తో కత్తి కార్తీక చర్చించారు. ఈ క్రమంలోనే కత్తి కార్తీక మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ గూటికి చేరే అవకాశాలున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.

బిజెపి గూటికి చేరబోతున్న కత్తి కార్తీక..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts