బిజెపికి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే..!

November 30, 2020 at 3:54 pm

రేపు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ఎన్నికల కార్యాలయం ముందు బిజెపి నేతలు ధర్నా నిర్వహించడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు బిజెపి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పై బీజేపీ ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తోంది అంటూ విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఫేక్ మీడియాను నడిపించడంలో బిజెపి కి నోబెల్ బహుమతి ఇవ్వాలి అంటూ విమర్శించారు.

బిజెపి ఓటర్లను తప్పుదోవ పట్టించి తమవైపు తిప్పుకునేందుకు ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపినప్పటికి కూడా… జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు.

బిజెపికి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts