బిజెపి టిఆర్ఎస్ ల పై.. ఎల్.రమణ విమర్శలు..?

November 26, 2020 at 4:46 pm

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా పీవీ నరసింహారావు ఎన్టీఆర్ సమాధులు కూల్చివేస్తామని అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేయడం వెంటనే స్పందిస్తూ.. ఒకసారి కూల్చి చూడండి చూద్దాం అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసరడం సంచలనంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎల్.రమణ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.

టిఆర్ఎస్ బిజెపి ఎమ్ఐఎమ్ పార్టీలు ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు అని విమర్శించారు. విద్వేషాలను సద్దుమణిగేలా పూర్తిగా నిర్మూలించినా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినప్పటికీ పట్టించుకోని బీజేపీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారి విషయంలో కపట ప్రేమ చూపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఘాట్ కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము అంటూ వ్యాఖ్యానించారు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు రమణ.

బిజెపి టిఆర్ఎస్ ల పై.. ఎల్.రమణ విమర్శలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts