
ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది దర్శకులు ప్రభాస్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు గా తెరకెక్కుతోన్నాయి . ప్రస్తుతం రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఆ తర్వాత ఆదిపురుష్ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ తర్వాత సినిమా గురించి మరో ఆసక్తికర టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
కే జి ఎఫ్ అనే సినిమాను తెరకెక్కించి అన్ని ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు అని అర్థమవుతుంది. కేజిఎఫ్ సినిమా నిర్మాణ సంస్థ హోమాబుల్ ఫిల్మ్స్ డిసెంబర్ 2వ తేదీన బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ బిగ్ అనౌన్స్మెంట్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి నదే అని ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.