కలర్ ఫోటో హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

November 29, 2020 at 7:31 pm

తెలుగు చిత్ర పరిశ్రమకి అడుగు పెట్టి ఏళ్ళు గడిచి పోతున్నప్పటికీ ఇటీవలే రిలీజ్ అయిన కలర్ ఫోటో చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు సాధించింది హీరోయిన్ చాందినీ చౌదరి. లఘు చిత్రాలలో నటించి తన నట ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత కేటుగాడు మూవీతో అవకాశం దక్కించుకుని టాలీవుడ్లోకి హీరోయిన్గా తెరంగేట్రం చేసింది చాందినీ చౌదరి. తనకు గుర్తింపు తీసుకు వచ్చే సినీమా కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ భామకు ఇటీవలే కలర్ ఫోటో చిత్రంతో పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దు గుమ్మా. సుహాస్ హీరోగా నటించిన సినిమాలో దీప్తి అనే పాత్రలో నటించి మెప్పించింది చాందినీ చౌదరి.

సినిమా ఓటిటి వేదికగా రిలీజ్ అయినప్పటికీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే తాజాగా తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తన ఫాన్స్ తో పంచుకున్నది ఈ భామ. ఇప్పటివరకు ఎన్నో హిట్ అయిన చిత్రాలు కూడా తన వద్దకు అవకాశాలు వచ్చాయని, కానీ ఓ పెద్ద నిర్మాత దగ్గర కాంట్రాక్టు లో ఉండడం వల్ల ఆ చిత్రాలు చేయలేక పోయాను అంటూ తెలిపింది చాందిని . కుమారి 21ఎఫ్, పటాస్ లాంటి మంచి సినిమాల్లో ఆఫర్లు మొదట తనకే వచ్చినట్లు తెలిపింది ఈ అమ్మడు.

కలర్ ఫోటో హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts