చంద్రబాబు అజెండా కోసమే ఆయన పనిచేస్తున్నారు..!

November 23, 2020 at 6:30 pm

ఇటీవలే పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన చంద్రబాబు సహా సిపిఐ రామకృష్ణ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ని తగ్గిస్తూ నిర్మిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబు సహా సిపిఐ రామకృష్ణ పై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు కావాలని పోలవరం ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారు అంటూ విమర్శించారు. చంద్రబాబు ఎజెండా ని సిపిఐ రామకృష్ణ తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు అంటూ విమర్శించారు మంత్రి అనిల్ కుమార్. పోలవరం పై తప్పుడు ప్రచారం చేయడంలో భాగంగానే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు అంటూ ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిల్.

చంద్రబాబు అజెండా కోసమే ఆయన పనిచేస్తున్నారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts