
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పోలీస్ తనిఖీలలో భారీగా డబ్బులు బయట పడుతూ ఉండటం కలకలం సృష్టిస్తోంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే భారీగా తరలిస్తున్న అక్రమ మద్యం బయటపడటంతో పాటు అక్రమంగా తరలిస్తున్న డబ్బులు కూడా బయట పడుతున్నాయి. ఇటీవలే మరోసారి ఇలాంటి తరహా ఘటన చోటుచేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కడప జిల్లా గోపవరం పిపి కుంట లో ఇటీవలే పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బులు బయటపడ్డాయి.
చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక వైపు నుంచి నెల్లూరు వెళ్లేందుకు ఒక వాహనం వచ్చింది. ఇక వాహనములు తనిఖీ చేయగా నోట్లకట్టలు చూసి ఒక్క సారిగా పోలీసులు షాక్ అయ్యారు నోట్లకట్టలు ఉండడంతో ఇవి ఎక్కడివి అని వాహనదారులను ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు తడబడ్డారు. డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు కూడా లేకపోవడంతో డబ్బులను సీజ్ చేశారు పోలీసులు. ఇక ఈ డబ్బు మొత్తం 1.05 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.