చేతులు కలపాలని సీఎం కు పిలుపు..?

November 23, 2020 at 5:16 pm

బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి… 4వ సారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసి ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ పూర్తయినప్పటికీ కూడా ఇంకా అంతర్గత కుమ్ములాటలు మాత్రం తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇక ఇటీవలే ఆర్జేడీ సీనియర్ నేత బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం త్వరలో కూలిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఆర్జేడీ సీనియర్ నేత అమర్ నాథ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ ఆరోపించిన అమర్నాథ్… బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణస్వీకారం చేసినప్పటికీ అసలు అధికారం మాత్రం బీజేపీ చేతుల్లోనే ఉంది అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలి అంటూ సూచించారు. ఇక త్వరలో బీహార్లో మహా ఘాట్ బంధన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు ఆయన

చేతులు కలపాలని సీఎం కు పిలుపు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts