చైనాని వదలని కరోనా.. మరోసారి..?

November 24, 2020 at 6:08 pm

కరోనా వైరస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన చైనాలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు చైనాలో కరోనా వైరస్ కేసులు తగ్గిపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇటీవలే మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య చైనాలోని పలు ప్రాంతాలలో పెరిగిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో నే మరోసారి కరోనా వైరస్ కేసులు విస్తరించకుండా చర్యలు చేపడుతుంది అక్కడి ప్రభుత్వం తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలలో కూడా కఠిన ఆంక్షలు విధిస్తోంది.

ఇప్పటికే 12 కేసులు నమోదైనప్పటికీ విమానాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న చైనా ప్రభుత్వం ఇటీవలే ఇలాంటి నిర్ణయం తీసుకుంది మరో ప్రాంతంలో. అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం పుడాన్గ్ ఎయిర్పోర్టులో విమాన సేవలను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. షాంఘైలో ఇటీవల 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ తరహా నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ సిబ్బంది అందరికీ కూడా ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది.

చైనాని వదలని కరోనా.. మరోసారి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts