దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ఈ చిత్రం కోసం మెగా స్టార్ చిరంజీవిని జక్కన్న లైన్లో పెట్టారట. అయితే ఈ చిత్రంలో చిరు నటించరు. కానీ, ఈ సినిమా తెలుగు వెర్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కారెక్టర్లను చిరంజీవి పరిచయం చేయనున్నారట. చిరంజీవి, రాజమౌళికి మంచి సాన్నిహిత్యం ఉండటానికి తోడు.. చరణ్ నటిస్తున్న సినిమా అవ్వడంతో చిరు వెంటనే ఈ ఆఫర్‌కి ఓకే చెప్పారట.
ఒకవేళ నిజంగానే చిరు `ఆర్ఆర్ఆర్`కు వాయిస్ ఓవర్ ఇస్తే మెగా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. ఇక మరో విషయం ఏంటంటే.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారు. ఆయన ఈ సినిమా హందీ వెర్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కారెక్టర్లను పరిచయం చేయనున్నారట. జక్కన్న ఇప్పటికే అమీర్ ఖాన్‌ను సంప్రదించగా.. ఆయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది.