
దర్శకుడు రాజమౌళి ప్రముఖ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రల తాలూకు ముఖ్యమయిన సన్నివేశాలకు టాలీవుడ్చి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ఓవర్ అందించబోతున్నారని వార్త వినిపిస్తుంది. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ఇందులో భాగంగా వివిధ భాషల్లోని ప్రముఖ కథానాయకులతో ఈ చిత్రానికి వాయిస్ఓవర్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. హిందీ వెర్షన్‌కు ప్రముఖ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ తన వాయిస్ అందించబోతున్నారని అంటున్నారు. అలాగే తమిళ, మలయాళ భాషల్లో కూడా ఆయా భాషల అగ్రహీరోలు వాయిస్ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యారని సమాచారం.దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.