సీఎంఆర్ఎఫ్ పేదలకు ఒక వరం లాంటిది అంటున్నా హరీష్..?

November 25, 2020 at 5:05 pm

సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటికే ఎంతో మంది లబ్ధిదారులు ఎంతగానో సహాయం పొందిన విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి హరీష్ రావు 19 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద చెక్కులు అందజేశారు. ఇక సీఎం సహాయనిధి కింద చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నంగునూరు మండలం లోని ముగ్గురికి చిన్నకోడూరు మండలం లోని ఇద్దరికీ సిద్దిపేట రూరల్ మండలంలోని ఒకరికి.. నారాయణ రావు పేట మండలంలోని ఇద్దరికీ ఈ చెక్కులను అందజేశారు మంత్రి హరీష్ రావు.

అయితే ప్రస్తుతం సీఎం సహాయనిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలు లబ్ది పొందుతున్నారు అంటూ ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. సీఎం సహాయనిధి ఎప్పుడు నిరుపేదలకు అండగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించిన ఆయన… చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు అందరూ వెంటనే బ్యాంకులో వాటిని డిపాజిట్ చేయాలి అంటూ సూచించారు.

సీఎంఆర్ఎఫ్ పేదలకు ఒక వరం లాంటిది అంటున్నా హరీష్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts