కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.. ఎందుకో తెలుసా..!

November 24, 2020 at 6:32 pm

తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సాధారణంగా అయితే అభ్యర్థులు అందరూ ముమ్మర ప్రచారం చేపట్టే వారు కాని ప్రస్తుతం కరోనా వైరస్ దృశ్య ఎన్నికల సంఘం కఠిన ఆంక్షలు విధించడంతో భారీ బహిరంగ సభలో ముమ్మర ప్రచారం నిర్వహించడం సాధ్యం కావడం లేదు. పలుచోట్ల నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఇటీవలే తన పర్యటనలు చేయనివ్వడం లేదని పాదయాత్రలు నిర్వహించడం లేదు అని ఆరోపిస్తూ జిహెచ్ఎంసి కార్యాలయం ముందు లలిత్ బాగ్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని అడ్డుకున్నారు. పోలీసులు తనకు ప్రచారం నిర్వహించేందుకు సహకరించడం లేదని అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను అని చెప్పుకొచ్చారు అయన.

కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం.. ఎందుకో తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts