కాంట్రాక్ట్ వల్ల.. ఆ హిట్ సినిమాలు చేయలేకపోయా : కలర్ ఫోటో హీరోయిన్

November 29, 2020 at 3:24 pm

గతంలో కేటుగాడు అనే సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ ఇటీవలే సుహాస్ హీరోగా తెరకెక్కిన కలర్ ఫొటో సినిమాతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నది చాందినీ చౌదరి. నటనతో అభినయంతో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గర అయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాతలు కూడా తమ సినిమాల్లో చాందినీ చౌదరి కి అవకాశం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురు చూసాను అంటూ చెప్పిన ఈ అమ్మడు.. ఇటీవలే కలర్ ఫోటో సినిమాతో తనకు మంచి హిట్ దక్కింది అంటూ చెప్పుకొచ్చింది చాందినీ చౌదరి. అయితే గతంలో ఓ బడా నిర్మాత దగ్గర కాంట్రాక్టు లో ఉన్న సమయంలో మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని చేయలేక పోయాను అంటూ తెలిపింది కానీ. ఆ తర్వాత ఆ సినిమాలు మాత్రం మంచి విజయాలు సాధించాయి చెప్పుకొచ్చింది చాందినీ చౌదరి.

కాంట్రాక్ట్ వల్ల.. ఆ హిట్ సినిమాలు చేయలేకపోయా : కలర్ ఫోటో హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts