దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త కేసులెన్నంటే?

November 27, 2020 at 11:36 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్‌ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 43,082 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,09,788 కి చేరింది. అలాగే నిన్న 492 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా లె‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,35,715 కి పెరిగింది. ఇక నిన్న ఒక్క‌రోజే 37,816 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 87,18,517 మంది కోలుకోగా.. 4,55,555 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో 11,31,204 క‌రోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పుడు వ‌ర‌కు మొత్తం టెస్ట్‌ల సంఖ్య 13,70,62,749 కి చేరింది.

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త కేసులెన్నంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts