ఇండియాలో 88 ల‌క్ష‌లు దాటిన రిక‌వ‌రీ కేసులు.. పాజిటివ్ కేసులెన్నంటే?

November 29, 2020 at 10:21 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్‌ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 41,810 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,92,920 కి చేరింది. అలాగే నిన్న 496 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా లె‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,36,696 కి పెరిగింది. ఇక నిన్న ఒక్క‌రోజే 42,298 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 88,02,267 మంది కోలుకోగా.. 4,53,956 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న‌ ఒక్కరోజులోనే 12,83,449 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా టెస్ట్‌ల సంఖ్య 13,95,03,803కు చేరుకుంది.

ఇండియాలో 88 ల‌క్ష‌లు దాటిన రిక‌వ‌రీ కేసులు.. పాజిటివ్ కేసులెన్నంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts