క్రాక్ విడుదలకు బ్రేక్ పడింది… లీగల్ గొడవలే కారణం!!

November 23, 2020 at 6:20 pm

డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని, హీరో మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో వచ్చిన డాన్‌శీను, బ‌లుపు సినిమాలు తరువాత మళ్ళి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న‌ హ్యాట్రిక్ మూవీ క్రాక్. ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని 2021సంక్రాంతి నాటికీ విడుదలకు సిద్ధం అవుతోంది. కానీ అనుకోని విధంగా ఇప్పుడుక్రాక్ చిత్రం పై ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకు వెళ్లడంతో లీగల్ ఇబందులు ఎదుర్కొంటుంది. ఈ మూవీ విడుదల నిలివేయాలంటూ స్టే ఇవ్వాలని ఆ డిస్ట్రిబ్యూటర్ కోర్ట్ ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే,స్క్రీన్ సీన్ మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టాగోర్ మధుపై న్యాయపోరాటానికి రెడీ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన డబ్బును చెల్లించకుండా క్రాక్ చిత్రం రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ కేసు పెట్టారు. ఆ డబ్బులు క్లియర్ చేసాకనే క్రాక్ మూవీను విడుదుల చెయ్యాలంటూ కోర్టులో స్టే పిటిషన్ వేశారని సమాచారం. సినిమా విడుదలపై ఈ ఎఫెక్ట్ ఎంత వరుకు చూపుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

క్రాక్ విడుదలకు బ్రేక్ పడింది… లీగల్ గొడవలే కారణం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts