డబ్బులు తీసుకుని మాకు ఓటు వేయండి : బీజేపీ నేత

November 25, 2020 at 6:23 pm

ఎప్పటినుంచో తెలంగాణలో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్న బిజెపి కి ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది అనే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అనే ఉద్దేశంతో ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతుంది బిజెపి. కాగా ఇప్పటికే బీజేపీకి మద్దతు తెలిపేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ బీజేపీ నేతలు కూడా కదిలి వస్తున్నారు. ఇటీవలే ఏపీ బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటర్లను బీజేపీకి పట్టం కట్టాలని హైదరాబాద్ మరింత అభివృద్ధి చేయగల సత్తా కేవలం బిజెపికే ఉంది అంటూ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకుని బిజెపికి ఓటు వేయాలని సూచించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెంది దేశానికి రెండో రాజధానిగా మారబోతుంది అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

డబ్బులు తీసుకుని మాకు ఓటు వేయండి : బీజేపీ నేత
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts