సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యుజ్వేంద్ర చాహాల్ డాన్స్ విడియో…!?

November 28, 2020 at 6:02 pm

టీం ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ యంగ్ క్రికెటర్ ఫేమస్ యూట్యూబర్ ధనశ్రీ వర్మ ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. స్వతాహాగా డాన్సర్ అయిన ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు. పలు సందర్భాల్లో ఆమె డాన్స్ వీడియోలు సోషల్వై మీడియాలో వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే.

తాజాగా ఆమె సాంగ్ కు డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ధనశ్రీ వర్మ పెట్టిన ఈ వీడియోకు అందరు ఫిదా అవుతున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ధనశ్రీవర్మ దిల్ హై ముష్కిల్ చిత్రంలోని పాటకు డాన్స్ చేసింది. ఈ వీడియోలో ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా డాన్స్ చేశారు. అదిరిపోయే స్టెప్పులేస్తూ ధనశ్రీ దుమ్ము దులిపిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యుజ్వేంద్ర చాహాల్ డాన్స్ విడియో…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts