దారుణం : భార్యను చంపి… తర్వాత భర్త కూడా..!?

November 22, 2020 at 2:55 pm

మనసా వాచా కర్మణా మూడు ముళ్ళు సాక్షిగా ఏకమైన బంధం ఎక్కువ రోజులు నిల్వడం ఈ మధ్య కాలంలో. చిన్నచిన్న కారణాలకే ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంతవరకు వెళ్తున్న ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చి అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మహారాష్ట్రలోని వెలుగులోకి వచ్చింది.

సెక్యూరిటీ గార్డుగా పని చేసే రాహుల్ అనే వ్యక్తి భార్య జ్యోతి తో కలిసి నివాసముంటున్నాడు అయితే ఇటీవలే ఏం జరిగిందో ఏమోకానీ గత కొన్ని రోజుల నుంచి ఆ ఇంట్లో లైట్లు వెలగడం లేదు. దీంతో చుట్టుపక్కల వారు గమనించి ఏం జరిగింది అని చూసేసరికి తలుపులు ఎవరు తీయలేదు. దీంతో కిటికీలోంచి గమనించగా బెడ్రూమ్ లో మంచం పై భార్య విగతజీవిగా పడి ఉండగా హాల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు భర్త. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రంగప్రవేశం చేసి తలుపులు పగులగొట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం : భార్యను చంపి… తర్వాత భర్త కూడా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts