ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిబంధన.. 26 కోట్ల జరిమానా..!

November 21, 2020 at 5:09 pm

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన మొదట్లో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం జోక్యం చేసుకుని కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో కాస్త కరొనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక గత కొన్ని రోజుల నుంచి మరోసారి కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.

కాగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కరోనా నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానా విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ప్రజలు మాత్రం మార్పు రాలేదు అన్నది ఇటీవలే అర్థమైంది. కేవలం కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారి దగ్గర్నుంచి జరిమానాల రూపంలో ఏకంగా ఇరవై ఆరు కోట్లు వసూలు చేశారు ఢిల్లీ పోలీసులు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది దీన్నిబట్టి ఢిల్లీలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అర్థం చేసుకోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిబంధన.. 26 కోట్ల జరిమానా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts