
బాలీవుడ్ లో నటి నటులు దిశాపటానీ, టైగర్ ష్రాప్ కనిపిస్తే చాలు కెమెరా కళ్లన్నీ వారిపైనే పడుతుంది. ఈ ఇద్దరు ఫిట్ నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. దిశాపటానీ ఎక్కువ టైము జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉన్న ఫొటోలు,వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అందాల భామ తన బాయ్ ఫ్రెండ్ ను ఫాలో అవుతూ కష్టమయిన స్టంట్ ఒకటి చేసింది.
హీరో టైగర్ ష్రాప్ చేసిన టోర్నడో కిక్స్ ను హీరోయిన్ దిశా పటాని అతి సులభంగా చేసేస్తూ అందరితో వావ్ అనిపించుకుంటుంది. టైగర్ ష్రాప్ తల్లి అయేషా ష్రాప్ కూడా దిశా పటానీ చేసిన ఈ పనికి ఫిదా అయ్యి, సూపర్ అంటూ కామెంట్ చేసారు. ఇదే కాదు తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాప్ కూడా ఈ వీడియోకు లైక్ కొట్టాడు.బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాప్ కు ఏమాత్రం తీసిపోను అన్న విధంగా దిశాపటానీ చేసిన టోర్నడో కిక్స్ వీడియో ప్రస్తుతం సోషమీడియాలో వైరల్ అవుతుంది.