డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన కోర్టు..?

November 22, 2020 at 2:05 pm

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై తిరుగులేని మెజారిటీతో జో బైడెన్ గెలుపొందిన నాటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈక్రమంలోనే జో బైడెన్ కు ఫోల్ అయినా ఓట్లపై… ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. జో బైడెన్ కి వచ్చిన ఓట్లను సవాలు చేస్తూ ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ .

ఈ క్రమంలోనే ఇటీవల డోనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. పెన్సిల్వేనియాలో నమోదైన కోట్ల కొద్ది ఓట్లను చెల్లవు అంటూ ప్రకటించాలని డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయగా దానికి జడ్జి నిరాకరించారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే హక్కు కోర్టుకు ఉండదు అంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే జో బైడెన్ విజయాన్ని గుర్తిస్తూ ఫలితాలను సోమవారం అధికారులు ఒకసారి సర్టిఫై చేసిన తర్వాత మిగతా అన్ని విషయాలను స్పష్టం చేస్టారు అంటూ కోర్టు జడ్జి తెలిపారు. వేల కోట్లను చెల్లుబాటు కానివి అని గుర్తిస్తే ఒక్కరు కాదు ఏకంగా రాష్ట్రంలోని అందరి ఓటు హక్కును కోర్టు ఉల్లంఘించినట్లు అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

డోనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన కోర్టు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts