డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్ షాక్ ఇచ్చిన‌ ట్విట్టర్?

November 6, 2020 at 10:59 am

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ బ‌రితంగా మారాయి. రెండ్రోజులు గడిచినా.. అమెరికా 46వ అధ్యక్షుడెవరన్నది ఇంకా తేలలేదు. రిపబ్లికన్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్ హోరా హోరీ పోటీ న‌డ‌వ‌గా.. బైడెన్‌దే గెలుపు ఖాయంగా క‌నిపిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం బైడెన్‌… 264 ఓట్లతో మేజిక్‌ ఫిగర్‌ 270 ఎలక్టోరల్‌ ఓట్లకు అతి చేరువలో ఉన్నారు.

అయితే డొనాల్డ్‌ ట్రంప్ మాత్రం 214 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. ఇక అధికారం దూరమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్న వేళ ట్రంప్ తాజాగా ట్విట్ట‌ర్ ఓ ట్విట్ చేశారు. `మనమే ముందున్నాం. అయితే, వారు ఈ ఎన్నికలను చోరీ చేయాలని చూస్తున్నారు. దాన్ని జరుగనివ్వబోము. ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్లను వేయనిచ్చేది లేదు` అని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టాడు ట్రంప్‌.

అయితే ఈ ట్వీట్ వివాదాస్పదమైనదని, పౌర సమాజంలో జరుగుతున్న ఎన్నికల విధానంపై తప్పుడు సంకేతాలు పంపించేలా ఉందని అభిప్రాయపడ్డ ట్విట్టర్.. ట్రంప్ చేసిన ట్వీట్‌ను తొలిగించి బిగ్ షాక్ ఇచ్చింది. మ‌రోవైపు ట్రంప్ ఇదే పోస్ట్‌ను ఫేస్ బుక్‌లో కూడా పెట్ట‌గా.. ఫేస్ బుక్ యాజమాన్యం సైతం ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది.

డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్ షాక్ ఇచ్చిన‌ ట్విట్టర్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts