ఇక అదొక్కటే మార్గం.. కర్ఫ్యూ కి సీఎం ఆదేశాలు..?

November 25, 2020 at 5:33 pm

మొన్నటి వరకు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ పలు రాష్ట్రాలలో మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని నిబంధనలను కఠినతరం చేశాయి. ఇక ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది అంటూ ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు. పూర్తి లాక్ డౌన్ విధించాల్సి ఉన్నప్పటికీ గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రమంలోనే రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు.

ఇక అదొక్కటే మార్గం.. కర్ఫ్యూ కి సీఎం ఆదేశాలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts