ఇక కవ్వింపు లకు పోము : ఆస్ట్రేలియా కోచ్

November 25, 2020 at 2:25 pm

సాధారణంగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ప్రేక్షకుల్లో ఎంత ఉత్కంఠ నెలకొని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే రెండు జట్లు తల పడుతున్న సమయంలో ఏ జట్టు గెలుస్తుంది అనేది కూడా మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒకరినొకరు మాటల యుద్ధానికి దిగడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే.

అయితే ఈ క్రమంలోనే ఈ సారి కూడా భారత్-ఆస్ట్రేలియా మధ్య స్లెడ్జింగ్ జరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తుండగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కొంతమంది స్పందిస్తూ భారత ఆటగాళ్లలో మాటల యుద్ధానికి దిగేందుకు సిద్ధంగా లేమని అలాంటి ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా జట్టు కోచ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆటగాళ్లతో మాటల యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేమని మైదానంలో సరదాగా ఉండాలనుకుంటున్నామూ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక కవ్వింపు లకు పోము : ఆస్ట్రేలియా కోచ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts