ఇండస్ట్రీలో అది చాలా కష్టం : మమతా మోహన్ దాస్

November 23, 2020 at 6:24 pm

సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దకాలం గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ కూడా మమతా మోహన్ దాస్ కి క్రేజీ ఎక్కడా తగ్గలేదు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నో తెలుగు తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే గత కొంత కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి మమతామోహన్దాస్ దూరం అయింది అన్న విషయం తెలిసిన. ఇక ఇటీవల మరోసారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి వైవిధ్యమైన పాత్రల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ అమ్మడు.

తాజాగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర ఈ వ్యాఖ్యలు చేసింది మమతా మోహన్ దాస్. తాను తన 15 ఏళ్ళ సినీ కెరీర్ ను ఎంతగానో ఆస్వాదించాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం తొందరగా సాధ్యం కాదని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే తన కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకున్నానని మళ్లీ వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో అది చాలా కష్టం : మమతా మోహన్ దాస్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts