ఇప్పటికైనా ఆపుతారా.. బండ్ల గణేష్ ఆగ్రహం..?

November 22, 2020 at 3:09 pm

సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కాస్త 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బ్లేడు గణేష్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఎందుకంటే 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ చేసిన విమర్శలు.. ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఏకంగా బ్లేడ్ తో… అందరి ముందు లైవ్ లో తన గొంతు కోసుకుంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.

దీంతో ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ఎప్పుడు బ్లేడ్ తో గొంతు కోసుకుంటారు అంటూ ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైపోయారు బండ్ల గణేష్. కాగా ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో చేసిన పోస్టులను మళ్లీ తెర మీదికి తెస్తున్నారు నెటిజన్లు. తాజాగా దీనిపై స్పందించిన బండ్ల గణేష్.. తాను ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని గతంలో తాను చేసిన పోస్టులను మళ్లీ పోస్ట్ చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఆపుతారా.. బండ్ల గణేష్ ఆగ్రహం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts