ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించను అంటున్న నితీష్ కుమార్..?

November 13, 2020 at 5:15 pm

ఇటీవలే బీహార్ ఎన్నికలు ఎంతో హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్ ఎన్నికల్లో ఫలితాలు ఎన్డీఏ కూటమి మరోసారి విజయబావుటా ఎగురవేసింది. ఇక బీహార్ రాష్ట్రంలో నాలుగవసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడటం సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే.

ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ తప్పుకుని రిటైర్మెంట్ తీసుకుంటారు అని అనుకున్నారు కానీ తన స్పీచ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్. తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదు అని… తన మాటలను అందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మరోసారి తన స్పీచ్ విని తన మాటల్లో అంతర్యం అర్థం చేసుకోవాలి అంటూ నితీష్ కుమార్ సూచించారు.

ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించను అంటున్న నితీష్ కుమార్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts