
తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన నిధి అగర్వాల్ మొదట్లో అంతగా అవకాశాలు అందుకోలేదు. కానీ తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులని ఆకర్షించడం తో పాటు దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించింది ఈ అమ్మడు ముఖ్యంగా.. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ దర్శక నిర్మాతలు చూపును తనవైపు తిప్పుకుంది. తమిళ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇటీవలే మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన ట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పిరియాడికల్ డ్రామాలో నటించ పోతున్న విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ ఎవరు నటించబోతున్నారు అనేదానిపై గత కొన్ని రోజుల నుంచి ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ సినిమాలో నిధి అగర్వాల్ ప్రస్తుతం ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ టాలీవుడ్ లో టాక్ మాత్రం ఊపందుకుంది.