ఎఫ్3 కోసం రెమ్యూనరేషన్ పెంచేసారుగా..?

November 28, 2020 at 3:34 pm

విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తూనే వుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అందరు భర్తలకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కోసం ప్రస్తుతం అంతా సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు కూడా జరుపుతుంది. ఈ సినిమా కోసం అటు వెంకటేష్ వరుణ్ తేజ్ లతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా భారీగా పారితోషికం పెంచేసినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. గతంలో ఎఫ్ 2 సినిమా కోసం 12 కోట్ల పారితోషికం తీసుకున్న ఇద్దరు హీరోలు ప్రస్తుతం 13 కోట్లు డిమాండ్ చేశాడట. సరిలేరు నీకెవ్వరు తో మరింత క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పారితోషికం పెంచేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఎఫ్3 కోసం రెమ్యూనరేషన్ పెంచేసారుగా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts