ఆదా శర్మ మాస్కు చూసి షాక్ అవుతున్న అభిమానులు…!

November 9, 2020 at 5:51 pm

అదాశర్మ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఈ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో చేసిన మొదటి సినిమా హార్ట్ ఎటాక్. ఈ సినిమాతోనే అందరికి పరిచయం అయింది. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో కొన్ని సినిమాలే చేసింది. కానీ నితిన్ చేసిన హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు అయితే దక్కించుకుంది కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ భామ వచ్చిన ఈ అవకాశాన్ని కూడా వదలకుండా నటిస్తుంది. సన్ అఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, లాంటి సినిమాల్లో సైడ్ హీరోయిన్ గా కూడా నటించింది.

ఈ మధ్య అదాశర్మ ఒక కాఫీ యాడ్ లో కూడా నటించింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతాయి. అయితే ఇప్పుడు అదా శర్మ ఒక ఫోటో అప్ లోడ్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏంటా ఆ ఫోటో అనుకుంటున్నారా.. ! ఓ వింత మాస్క్ ధరించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటీ. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఇలా కనిపించి షాక్ ఇచ్చింది. బ్లాక్ గాగుల్స్ పెట్టి, పెదవులకీ ఎర్రటి లిప్ స్టిక్ వేసుకుని, మాస్క్ ధరించి, పళ్ళు కనపడేలా నోరు వెళ్ళబెట్టి మరి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.. !!

ఆదా శర్మ మాస్కు చూసి షాక్ అవుతున్న అభిమానులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts