ర‌జినీకాంత్‌కే షాక్ ఇచ్చిన ఫ్యాన్స్‌.. ఏం జ‌రిగిందంటే?

November 30, 2020 at 12:14 pm

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఓ ప‌ట్టాన తేల‌డం లేదు. రజినీకాంత్ తమిళనాట రాజకీయ రంగ ప్ర‌వేశం చేస్తారని ఆయన అభిమానుల‌తో తోపాటు తమిళ ప్రజలు కూడా ఎంతో కాలంగా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు ఆయ‌న‌ సోదరుడు సత్యనారాయణ కూడా రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం ప‌క్కా అని పదే పదే చెబుతున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అందుకు ముహూర్తం ఫిక్స్ కాలేదు.

అయితే ర‌జినీకాంత్ నేడు త‌న అభిమాన సంఘాల నాయ‌కుల‌తో చెన్నైలోని స్థానిక రాఘ‌వేంద్ర క‌ల్యాణ మండ‌పంలో మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌ త‌ర్వాత త‌లైవా కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. కానీ, ఇంత‌లోనే ర‌జినీకాంత్‌కు అభిమానులు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. నేటి ఉద‌య‌మే ర‌జినీకాంత్ ఇంటికి చేరుకున్న అభిమానులు నినాదాలు చేపట్టారు.

ఈ క్ర‌మంలోనే బీజేపీకి వ్య‌తిరేకంగా కొంత‌మంది అభిమానులు నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం. మీరు రాజ‌కీయాల్లోకి వ‌స్తే మీ వెంటే ఉంటామంటున్న త‌లైవా అభిమానులు.. బీజేపీకి స‌పోర్ట్ చేస్తే మాత్రం అంగీక‌రించేది లేదంటూ చెప్ప‌క‌నే చెప్పి షాక్ ఇచ్చారు. మ‌రి త‌లైవా నిర్ణ‌యం ఎలా ఉంటుందో అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

ర‌జినీకాంత్‌కే షాక్ ఇచ్చిన ఫ్యాన్స్‌.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts