గెటప్ శ్రీను హీరోగా సినిమా ప్రారంభం..!

November 21, 2020 at 4:34 pm

జబర్దస్త్ ఫేమ్ గెట‌ప్‌ శ్రీ‌ను హీరోగా సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ రాజు యాద‌వ్. గొప్ప గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రఖ్యాత దర్సుకులతో పనిచేసిన కృష్ణ‌మాచారి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో గెట‌ప్ శ్రీ‌ను కి జతగా హీరోయిన్ గా అంకిత క‌ర‌త్ న‌టిస్తున్నారు. హైదరాబాద్ లో శనివారం నాడు ఈ చిత్రం షూటింగ్ లాంఛ‌నంగా మొదలయింది. డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వగా, స‌హ‌జ‌సిద్ధ‌మైన పాత్ర‌ల‌తో, ఆర్గానిక్ మేకింగ్‌తో ఈ కధ ఉండబోతుందని దర్శకుడు కృష్ణ‌మాచారి తెలిపారు.

వాస్త‌వానికి అతి ద‌గ్గ‌ర‌గా, స‌మాజంలో మనం నిత్యం ఎదురుకొనే సంఘటనలని చూపిస్తూ,మాములు కుటుంబంలోని వేరు వేరు మ‌న‌స్త‌త్వాలు, వాళ్ళ కోరిక‌లు, చివ‌ర‌గా వాళ్ళ ప్ర‌యాణం ఎలా సాగుతుందో తెలిపేవిధంగా ఈ సినిమా ఉంటుంది అని ఆయ‌న చెప్పుకొచ్చారు. న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావ‌డంతో గెట‌ప్ శ్రీ‌నుని ఈ ముఖ్య ‌పాత్ర కోసం అడ‌గ‌టం, ఆయ‌నకు క‌థ నచట్టంతో వెంట‌నే ఓకే చెప్పేయటం కూడా అయింది. ప్రస్తుతం పాత్ర‌కు త‌గ్గ‌టుగా త‌న బాడీని మౌల్డ్ చేసుకుంటున్నారు గెట్ అప్ శ్రీను. ఈ సినీమా ద్వారా గెట‌ప్ శ్రీ‌నులోని నటనలో ఒక కొత్త కోణం ప్రేక్ష‌కులు చూస్తారని ద‌ర్శ‌కుడు కృష్ణ‌మాచారి చెప్పారు.

గెటప్ శ్రీను హీరోగా సినిమా ప్రారంభం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts