జిహెచ్ఎంసి ఎన్నికలు.. అలా చేస్తే మీ డబ్బులు సీజ్..?

November 21, 2020 at 5:04 pm

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడ డబ్బు అక్రమ రవాణా జరగకుండా అప్రమత్తం గా ఉంటున్నారు. అదే సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ నిఘా పెడుతున్నారు పోలీసు అధికారులు. క్రమంలోనే హవాలా నగదు ఈ మధ్య కాలంలో భారీగా పట్టుబడుతుంది.

తాజాగా ఇదే విషయంపై సీపీ అంజనీ కుమార్ అందరికీ పలు సూచనలు చేయడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తున్నప్పుడు రశీదు లేకపోతే ఆ నగదు మొత్తాన్ని సీజ్ చేస్తామని… స్పష్టం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని అనుకొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిహెచ్ఎంసి ఎన్నికలు.. అలా చేస్తే మీ డబ్బులు సీజ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts