జిహెచ్ఎంసి ఎన్నికలు : చేయి గుర్తు చెయ్యిచ్చిన అభ్యర్థి..!

November 28, 2020 at 3:27 pm

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రచారం చేపడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేయడమే కాదు.. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఎంతగానో ప్రయత్నాలు మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలుచోట్ల ఇలా టిఆర్ఎస్ వ్యూహాలు కూడా పలిస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. చేయి గుర్తు బలపరిచిన అభ్యర్థి ఏకంగా పార్టీకి చెయ్యిచ్చాడు.

అబ్దుల్ అఫ్జల్ గంజ్ బేగంబజార్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పురుషోత్తం ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. సరిగ్గా ఎన్నికల ముందు ఇలా జరగడం కాంగ్రెస్కు గట్టి దెబ్బ అని చెప్పాలి. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకొని పార్టీలోకి వచ్చారు బేగంబజార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుషోత్తం.

జిహెచ్ఎంసి ఎన్నికలు : చేయి గుర్తు చెయ్యిచ్చిన అభ్యర్థి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts