జిహెచ్ఎంసి ఓటర్లకు కె.ఏ.పాల్ కీలక సూచనలు..?

November 30, 2020 at 4:00 pm

గతంలో ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో వాలిపోయిన మత బోధకుడు కే ఏ పాల్ ప్రజాశాంతి అనే పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 170 స్థానాల్లో మేమే గెలుస్తామని అంటూ ఆంధ్ర రాజకీయాల్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక్క సీటు కూడా గెలవకపోవడం తో మళ్ళీ విదేశాలకు వెళ్లిపోయారు కె ఏ పాల్. ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్ష మై జిహెచ్ఎంసి ఎన్నికల గురించి మాట్లాడారు.

ప్రస్తుతం మార్పు కోసం జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓట్లు అమ్ముకోకుండా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని మార్పుకోసం నాంది పలకాలని సూచించారు. త్వరలో తాను కూడా హైదరాబాద్ వస్తున్నానని.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో గొప్ప మార్పు జరగబోతుంది అంటూ వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.https://youtu.be/-YoCVIcsrp4

జిహెచ్ఎంసి ఓటర్లకు కె.ఏ.పాల్ కీలక సూచనలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts