వాట్సాప్ యూసర్ లకు శుభవార్త..!

November 10, 2020 at 4:44 pm

ప్రస్తుత కాలంలో వాట్సాప్ యాప్ వాడే యూజర్లు అధికం అయిపోయారు. కేవలం మెసేజెస్ కీ మాత్రమే కాకుండా ఇప్పుడు అన్ని రకాలుగా యూస్ చేసుకునే అవకాశం కలదు. వాట్సాప్ పేమెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇప్పుడు వాట్సప్ యూజర్లు వాట్సప్‌లో షాపింగ్ చేసుకునే అవకాశం కూడా కలదు. యాప్‌లో మీకు ఇకపై షాపింగ్ బటన్ కనిపించనుంది. డైరెక్ట్ క్యాటలాగ్ ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ కొనొచ్చు.

కేటలాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఓపెన్ చేసి, మీకు నచ్చితే వెంటనే వాట్సప్‌లోనే కొనుకోవచ్చు. వాయిస్ కాల్ బటన్ ప్లేస్‌లో ఇక మీదట షాపింగ్ బటన్ కనిపించనుంది. కాల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వాయిస్ లేదా వీడియో కాల్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక గతంలో బిజినెస్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే కేటలాగ్ కనిపించేది కానీ ఇప్పుడు అక్కడ షాపింగ్ బటన్ కనిపిస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్‌ని బ్రౌజ్ చేసి షాపింగ్ చేయొచ్చు. బిజినెస్ అకౌంట్ ఉన్న వ్యాపారులు తమ సేల్స్ పెంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే అందరికి ఈ షాపింగ్ బటన్ కనిపించదు. బిజినెస్ అకౌంట్స్ ఉన్నవారికి మాత్రమే ఈ షాపింగ్ ఫీచర్ పనిచేస్తుంది

వాట్సాప్ యూసర్ లకు శుభవార్త..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts