ట్రూ కాలర్ కి పోటీ ఇవ్వబోతున్న గూగుల్..!?

November 24, 2020 at 3:23 pm

మొబైల్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే యాప్స్ లో ట్రూకాలర్ యాప్ కూడా ఒకటి. ఈ యాప్ సహాయంతో తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే, మనకు పేరు వస్తుంది. అలాగే స్పామ్ కాల్స్ వస్తే బ్లాక్ చేసే సౌలభ్యం కూడా ఉంది. కానీ ట్రూ కాలర్ థర్డ్ పార్టీ యాప్ అవ్వడంతో, యూజర్ భద్రతపై పలు అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అనుమానాలకు చెక్ పెడుతూ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్ ట్రూకాలర్‌ మాదిరిగానే, అదే ఫీచర్స్ తో తన ఫోన్‌ యాప్‌లో పలు మార్పులు చేస్తుందట.

ఈ యాప్ కి గూగుల్ కాల్ అనే పేరు నిర్ధారణ చేసారు. ప్రస్తుతం ఈ క్రొత్త యాప్ గురించి యూట్యూబ్ లో ఒక ప్రకటన కూడా వెలువడింది. ఈ ప్రకటనలో గూగుల్ కాల్ యాప్ పేరు, లోగోను విడుదల చేసారు. ఈ గూగుల్ కాల్ యాప్లో కొత్తగా కాలర్ ఐడీ ఫీచర్‌ను జత చేసారంట.ఇంకా ఈ యాప్ స్పాం కాల్స్ నుండి రక్షణ కూడా అందిస్తుంది. మొత్తానికి గూగుల్ ఫోన్ యాప్‌ పేరు మార్చి మరిన్ని కొత్త ఫీచర్స్‌ జోడించి, కాల్ యాప్‌తో వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ట్రూ కాలర్ కి పోటీ ఇవ్వబోతున్న గూగుల్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts